aa aaalu

Wednesday, February 18, 2009

పుస్తక పరిచయం

కన్ను తెరిస్తే జననమెలే...కన్ను మూస్తే మరణమెలే...ఈ రెప్పపాటులో జీవితమంతా సాగునులే................

నువ్వే కాదు...ఏ మనిషయినా...అద్దంలోకి చూసె క్షణాన...ఆ ప్రతిరూపం అడిగే ప్రశ్న...నేను నీకు తెలుసా?
- సీతారామ శాస్త్రి.

ఒకవేళ ఏ వ్యక్తయినా, తన జీవితంలో ఒక్కసారయినా, తనకి తాను ఈ ప్రశ్నలు వేసుకొని, ఆ ప్రశ్నలకి సరయిన సమాధానాల్ని కనుక్కోగలితే, ఆ సమాధానాలు ఎలా ఉంటాయో, సుస్పష్టంగా విడమరిచి చెప్పగలిగే అతి తక్కువ తెలుగు పుస్తకాలలో "జనార్ధన మహర్షి గారి" 'నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ ' ఒకటి.

మంచి పుస్తకాన్ని ఎవరయినా తమ జీవితంలో ఎంత త్వరగా చదివితే, వారికే అంత మంచిది అని నా అభిప్రాయం. చదువరీ! ఇక నీ ఇష్టం.

నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ నుంచి ఒక మచ్చు తునక -

అత్యధిక అపజాయాలని సాధించడంలో
నా అంత విజయుడు లేడు...

నేనెంత పాతాళంలో ఉన్నానంటే...
భూమ్మీద ఉన్న మనుష్యులంతా
నాకు అకాశమంత ఎత్తులో కనబడతారు...

అన్ని ద్వారాలు మూసుకుపోయాయని
ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కూడా
నా ఓటముల్ని చూస్తే
అన్య మార్గాలెన్నుకుంటారు...అజేయులవుతారు...

"నాతో నాలుగు నిమిషాలు ప్రయాణం చేస్తే
మీ మీద మీకు చచ్చేంత ప్రేమ పుడుతుంది".


ప్రత్యక్షంగా ఆయనతో పరిచయం లేకపోయినాసరే, అడిగీ అడగంగానే ఆ పుస్తకంలోని ఒక చిన్న (వచన) కవితని, ఇక్కడ ముద్రించడానికి అనుమతించిన జనార్ధన మహర్షి గారికి...ధన్యవాదాలు తెలుపుకుంటూ...

Followers

About Me

My photo
I read to know who I am; I write to tell who I am and I teach to know who I am not.